ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు పలువురిపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. వందల కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Naa Anveshana Police Case: ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్(Youtuber Naa Anvesh) పై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రమోషన్లు(Betting App Promotions) చేసిన వారిపై అన్వేష్ వరుసగా వీడియోలు రిలీస్ చేస్తున్న విషయం తెలిసిందే. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు పలువురిపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. రూ.300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతకొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేస్తున్నవారిని టార్గెట్ చూస్తూ అన్వేష్ వీడియోలు విడుదల చేస్తున్నారు. అందులో పలువురు హీరోలు, సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు, యాంకర్లు, బిగ్ బాస్ కటెస్ట్‌టెంట్లు ఉన్నారు. వారు వందల కోట్లు డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అన్వేష్ ఆరోపించాడు. అన్వేష్ విదేశాల్లో నుంచి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాడు.
అన్వేష్ సంచలన ఆరోపణలు
అన్వేష్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్‌లపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు చేశాడు. ఈక్రమంలోనే అతనిపై పోలీస్ కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నాడు. దీంతో అన్వేష్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి
Also Read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!