ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎస్వీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పామర్తి జ్యోత్స్న అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలం కోటపాడుకు చెందినవారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG Crime: ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన ఉధ్రిక్తతకు దారి తీసింది. సత్తుపల్లిలోని ఎస్వీఎస్ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం తమ బంధువి ప్రాణం తీసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మృతురాలు పామర్తి జ్యోత్స్న ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందినవారు. గర్భసంచి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను బంధువులు సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి స్కాన్ చేయించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారినందున ఆమెను బుధవారం రాత్రి ఎస్వీఎస్ ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రాణం తీసిన ఆపరేషన్:
ఆసుపత్రి వైద్యులు తొలుత రోగినీ పరీక్షించి ఆపరేషన్ అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ బ్లీడింగ్ తీవ్రమై, బ్లడ్ ప్రెషర్, హీమోగ్లోబిన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడం వల్ల పరిస్థితి సీరియస్‌గా మారిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమెను బ్రతికించేందుకు తమవంతు ప్రయత్నాలు చేశామని, పరిస్థితి దృష్ట్యా తక్షణమే శస్త్రచికిత్స అవసరమని భావించి బంధువుల నుండి అనుమతి తీసుకున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల ప్రకారం.. ఆసుపత్రిలో గైనకాలజీ సర్జన్ లేకపోయినా, సర్జరీ నిర్వహించడం తీవ్ర గమనార్హమైన అంశమని పేర్కొన్నారు.
ఆపరేషన్ తర్వాత మొదట రోగి ఆరోగ్యం బాగుందనీ, ఆపరేషన్ విజయవంతమైందనీ వైద్యులు తెలిపారు. కానీ కొద్ది గంటల్లోనే ఆమె గుండె ఆగిపోయిందని తెలిపారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జ్యోత్స్న మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువుల ఆవేదనతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తే ఆత్మ పరిస్థితి ఏమిటంటే..
- Andhra Pradesh: అక్కడ చెరువు గట్టుపై అమ్మవారి మట్టి బొమ్మని చేసి ఘనంగా పూజలు చేసే రైతులు.. ఎందుకంటే
- నేటి జాతకము 2 మే, 2025
- Astro Tips: మాంగళ్య దోషమా.. ఆర్ధిక ఇబ్బందులా.. అరటి చెట్టుకి ఇలా పూజించండి.. శుభఫలితాలు మీ సొంతం..
- Telangana: నర్సులుగా వైద్య సేవలు అందిద్దామనుకున్నారు… కానీ బొలెరో రూపంలో