కరీంనగర్ం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్ లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు.
అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Sun Transit: గ్రహ రాజు రవి అనుకూలత.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి
- Vastu tips for Mirror: ఇంట్లో వాస్తు దోషాలున్యాయా.. బెస్ట్ రెమిడీ అద్దం అని మీకు తెలుసా..!
- Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….
- Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు