అనంతపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన్ను లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది.
లక్ష్మీనారాయణ, అతని కుమారుడితో కలిసి ఇన్నోవా వాహనంలో గుంతకల్ నుండి చిప్పగిరికి వెళుతుండగా.. రైల్వే వంతెన సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్ తో ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టి. తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణను వేట కొడవల్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న అతని కుమారుడిని మాత్రం దుండగులు ప్రాణాలతో వదిలేశారు. ఈ ప్రమాదంలో అతని కుమార్ వినోద్ కూడా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!