దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నాను.. ఇక ఈ లోకంతో నాకు సంబంధం లేదు.. అంటూ ఓ 63 ఏళ్ళ వృద్దుడు ఆసుపత్రి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.. ఏ ఊరో తెలియదు.. అతను మాట్లాడే కన్నడ భాష ద్వారా అతను కార్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.. కాషాయం దుస్తులు ధరించి ఉన్న ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం గాయపడి అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ క్రమంలోనే.. తనను దేవుడు పిలుస్తున్నాడంటూ.. ఆసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. సాయికుమార్ (63) అనే వృద్ధుడు రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న క్రమంలో.. దేవుడు తనను పిలుస్తున్నాడని ఈరోజే తన ఆఖరి రోజని తోటి రోగులతో చెప్పాడు సాయికుమార్.. కాషాయం దుస్తులు ధరించి ఆధ్యాత్మికంగా మసలుకునే సాయికుమార్ మాట వరుసకి అంటున్నాడని తోటి రోగులు అనుకున్నారు. అయితే అతను చెప్పినట్టుగానే ఈ రోజు ఉదయం ఆసుపత్రి భవనంపైకి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. వృద్ధుడు ఆసుపత్రి భవనం పైనుంచి కిందకు దూకే ముందు అక్కడ తిరిగిన దృశ్యాలు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.. వృద్ధుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- 2026 ఉగాది పంచాంగం.. వృషభ రాశి వారికి రాజయోగమే!
- 2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!
- అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..
- వాట్సప్ మెసేజ్ గొడవ .. హైదరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య!
- అర్ధరాత్రి వృద్ధురాలి అగచాట్లు.. దారి మళ్లించి దోచుకున్న ఆటో డ్రైవర్! ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు




