అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామస్తుడు బూరం వీరయ్య ఏప్రిల్ 15న హత్యకు గురైయ్యాడు. వీరయ్య చిన్న కొడుకు పరమేష్‌కు అదే గ్రామానికి చెందిన మహేష్ భార్యతో అక్రమ సంబంధం ఉంది. ఎంత చెప్పినా పరమేష్ మరకపోవడంతో మహేష్ అతని ఫ్యామిలీపై అటాక్ చేసి తండ్రిని చంపేశాడు.
కొడుకు చేసిన తప్పుకు తండ్రి బలైపోయాడు. ఏప్రిల్ 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలో హైవేపై హత్య జరిగింది. ఆ కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్ వెల్లడించారు. పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నడింపల్లికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. మార్చి 10న ఆంధ్రప్రదేశ్‌గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు.
మహేశ్ భార్యతో దిగిన ఫోటోలు పరమేష్ వాట్సాప్ స్టేటస్
తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త మహేశ్ ఫిర్యాదు చేశాడు. మహేశ్ బంధువులతో గురుజాలకు వెళ్లి పరమేశ్‌పై దాడిచేసి అతని భార్యను ఇంటికి తీసుకువచ్చారు. తన్నులు తిన్నా పరమేశ్ వైఖరిలో మార్పు రాలేదు. వాట్సప్ స్టేటస్‌లో ఏప్రిల్ 15న ఆ మహిళతో కలిసి ఉన్న ఫొటోలను పెట్టాడు. దీంతో భర్త మహేశ్‌కు కోపం వచ్చింది. అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్‌లతో కలిసి పరమేశ్ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తున్న పరమేశ్ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్‌లను వెంబడించారు. నడింపల్లి దగ్గరకు రాగానే ఒక్కసారిగా వీరయ్యని గొడ్డలి, సుత్తితో కొట్టి చంపారు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా తృటిలో గాయాలతో తప్పించుకున్నాడు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు ఇదివరకే క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025