ఆదిలాబాద్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పిల్లలపై గుర్తు తెలియని దండుగులు విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. తాగే నీటి ట్యాంకులో విషం కలపడం, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు. ప్రిన్సిపల్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలోని పిల్లలపై విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. కొందరు గుర్తు తెలియని దుండగులు విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో విషం కలపడంతో పాటు మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు
పాఠశాల ఆవరణంలో పురుగుల మందు డబ్బా..
ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో పురుగులు మందు డబ్బా కనిపించడం, పురుగుల మందు వాసన రావడంతో.. అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తు 30 మంది విద్యార్థులు ఈ విష ప్రయోగం నుంచి క్షేమంగా బయట పడ్డారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై విష ప్రయోగం ఎవరు చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పిల్లలను చంపాలని ప్లాన్ చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
Also read
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!