బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఓ విమానం వచ్చి ల్యాండ్ అయింది. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు అవుట్ పాయింట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు. వారి కదలికలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగంలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తనిఖీల్లో పట్టుబడిన గంజాయి ఆయిల్ విలువ దాదాపు 9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తరచుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి తరహా మాదకద్రవ్యాలు పట్టుబడడం చూస్తూనే ఉంటాం. అధికారులు ఎంత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
గతంలో సైతం గంజాయి పట్టుబడిన సంఘటనలను పరిశీలిస్తే.. పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. డ్రగ్స్, గంజాయి పట్టుబడిన ఘటనల్లో భారీ స్థాయిలో అధిక మొత్తంలో విలువ చేసే పదార్థాలు దొరికాయి. గతేడాది స్వీట్స్, చాక్లెట్ బాక్సుల్లో గంజాయిని తరలిస్తుంటే పట్టుబడిన ఘటనలు కూడా చూశాం. మరో ఘటనలో ఏకంగా విమానాశ్రయంలో పాములు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనలో మరోసారి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ముగ్గురి వద్ద దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇండిగో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మేరకు 9 కోట్లు విలువ చేసే గాంజా ఆయిల్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, నిందితులను విచారణ చేపట్టారు
Also read
- తన భార్యపై మోజు పడ్డాడని.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని.. మృతదేహంపై నిల్చోని.. పెద్దపల్లిలో దారుణ హత్య!
- Tirumala Alert: పూజలు పేరుతొ కేటుగాడి మోసం.. తిరుమలలో జాగ్రత్త..
- గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. కన్నతండ్రే ఆరేళ్ల బాలికను – చెమటలు పట్టిస్తున్న….
- అక్షయ తృతీయ పేరుతో ఘరానా మోసం..రూ. 10కోట్లు మోసం చేసి పారిపోయిన వ్యాపారి
- TG Crime: ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి