భోగాపురం(విజయనగరం జిల్లా) : ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. భోగాపురం ఎస్‌ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం. ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల శ్రావణి (19) విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థిని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పాపారావు తెలిపారు
Also read
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?