ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.
కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే