తిరుపతి జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత డెత్ మిస్టరీపై ఆమెను ప్రేమించిన అజయ్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. నిఖితను ఆమె తల్లిదండ్రులు వేధింపులకు గురిచేశారని, పరువు కోసం వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేశాడు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత అనుమానాస్పద మరణం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘కోర్ట్’ సినిమాను తలపించేలా ట్విస్టులతో కూడిన విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇది పరువు హత్య? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మా, నాన్నే చంపేశారు..
ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అజయ్.. తన ప్రేమికురాలు నిఖిత డెత్ మిస్టరీకి సంబంధించి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. నిఖితను ఆమె తల్లిదండ్రులు వేధింపులకు గురిచేశారని, పరువు కోసం వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ఆరోపించాడు. ప్రేమిస్తే గొడవలు అవుతాయని అనుకున్నాను కానీ… కేసులు పెడతారని, జైల్లో వేస్తారని తనకు తెలియదని తెలిపాడు. నికిత తాను చాలా కాలం ప్రేమించుకున్నామని, గతంలో తమకు పెళ్లి కూడా అయ్యిందని చెప్పాడు. అయితే పెళ్ళైన తర్వాత ఆమె తల్లిదండ్రులు తనపై పోక్సో కేసు పెట్టారని, నిఖితను భయపెట్టి ఇంట్లోనే బంధించారని తెలిపాడు అజయ్. అయినప్పటికీ నిఖిత తనపై ప్రేమతో జైలుకు వచ్చి బెయిల్ ఇప్పించేందుకు కూడా ప్రయత్నించిందని వాపోయాడు.
అజయ్ ఇంకా మాట్లాడుతూ.. మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే ఇలాంటి కేసులు ఉంటాయని నాకు తెలియదని, సహజంగా ప్రేమిచుకున్నాక గొడవలై పోలీస్ స్టేషన్ కి వెళ్ళి.. ఆ తర్వాత అంతా సెట్ అవుతుంది. నా విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరిగింది అంటూ అజయ్ తెలిపాడు.
అయితే నిఖిత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు హడావిడిగా దహనం చేయడం, మరణానికి ముందు నిఖిత అజయ్ కి పంపిన మెసేజ్ లు, గ్రామస్తుల సమాచారం, అజయ్ చెప్పిన వివరాల ఆధారంగా నికిత మృతి వెనుక పరువు హత్య అనుమానం బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖచ్చితమైన నిర్దారణ కోసం పోలీసులు ఇంకా వివరాలను సేకరిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





