లక్కవరపుకోట (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో ఘోరం జరిగింది. ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబసభ్యుల కథనం ప్రకారం… రంగరాయపురం పంచాయతీ రెల్లిపేటకు చెందిన ఒక బాలుడు శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో అదే పేటకు చెందిన ఒక బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఆర్‌డిఒ కీర్తి శనివారం పరామర్శించారు. విజయనగరం డిఎస్‌పి శ్రీనివాసరావు, ఎస్.కోట సిఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్‌ఐ నవీన్‌పడాల్ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాలుడిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ కోర్టుకు తరలించినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also read
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.
- చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!
- స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు
- కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి





