పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరోలో తేలిపోతుందన్నారు.
Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏపాల్ మరో సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరో తేలిపోతుందన్నారు.
సీబీఐ ఎంక్వయిరీ చేయాల్సిందే..
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కేఏపాల్.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వెయాలనే అంశాన్ని న్యాయమూర్తి ఠాకూర్ కు వివరించడం జరిగిందన్నారు. ఆక్సిడెంట్ అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? అనేది తెలియాలి కదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఎస్సైకి ప్రవీణ్ తాగి వున్నారు అని తెలిసినప్పుడు ప్రవీణ్ తాగితే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు? ఫైన్ వెయ్యలేదు? అని అడిగారు. మీడియాలో ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ జీరో కావాలా హీరో కావాలా అనేది ఈ కేసులో జరిగే దర్యాప్తు బట్టే తెలుస్తుందన్నారు. ఇక మందు కొన్నది ప్రవీణ్ కాదని, అతని జీవితంలో మందు తాగలేదు కొనలేదని ప్రవీణ్ సోదరి చెబుతున్నారు.
వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో అని తెలుసుకోమన్నా మాట నిజామా కాదా. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్స్ మీదనే ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. సీసీ టివి ఫోటీజ్ డాకుమెంట్స్ ప్రెజర్వు చెయ్యండి. పోస్టుమార్టం రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి. పవన్ కు బుద్ది జ్ఞానం ఉంటే ఇలాంటి చట్టాలు చెయ్యడంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో