జనగామ జిల్లా పాలకుర్తి పొలిమేరలో సినీ ఫక్కీ క్షుద్రపూజలు సంచలనం రేపాయి. అర్ధారత్రి ఓ వాగులో నగ్న పూజలు చేసిన వైనం స్థానికుల్ని హడలెత్తించింది. పెళ్లి కాని యువతుల్ని, పిల్లలులేని మహిళల్ని టార్గెట్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కష్టాల నుంచి గట్టెక్కాలనుకునే వాళ్లు ..అనారోగ్యం నుంచి కోలుకోవాలని కొందరు ఇట్టాంటి భూత వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ఇక ఇంకొందరుంటారు. షాట్‌కట్‌లో కుబేరులైపోవాలని గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తుంటారు. పడనోళ్లపై పగ తీర్చకునేందుకు చేతబడి బాట పడుతారు మరికొందరు. ఇలాంటి వారిలో ఎవరి పనో ఏమో కానీ పల్లెబాటలో మంత్రాల గత్తెర లేపారు.అదీ కూడా భూతాధిపతి పాలకుర్తి సోమన్న క్షేత్రానికి కూతవేటు దూరంలో. దండెమ్మ గుడి దగ్గరలో.పచ్చని పల్లె దర్దేపల్లిలో ముగ్గులేసి ముసలం రేపారు.
నీళ్లు అంతగా లేని వాగులో నిమ్మకాయలు…పసుపు, కుంకుమ, ఎండు మిరపకాయలు, పుర్రెలు , ఎముకలు..నల్లకోడి బలి ఇవ్వడం…నో డౌట్. ఇవన్నీ పక్కాగా క్షుద్రపూజల ఆనవాళ్లే. కానీ ఇక్కడ మరో విచిత్రం దర్దేపల్లి గ్రామానికి దడ రేపింది. మహిళ ఆకారంలో ముగ్గేశారు..కరెక్ట్‌గా ఆ ముగ్గులో నల్లకోడిని బలి ఇచ్చారు. స్పాట్‌లో గాజులు, యువతి లో దుస్తులు కూడా కన్పించడంతో స్థానికులు షాకయ్యారు. అసలు ఈ క్షుద్ర తంతు ఎందుకోసం. ఎవరి కోసం?..ఆరా తీస్తే ఒల్లు జలదిరంచే ముచ్చట్లు తెరపైకి వచ్చాయి.
బాణామతి..చేతబడి వంటి క్షుద్రపూజల్లో ముగ్గులు వేయడం ..బొమ్మను పెట్టి పిన్నులు కుచ్చడం మాములే. కానీ ఇక్కడ సీన్ అట్టా లేదు. అంతకు మించి కత నడిపారిక్కడ. బొమ్మ గీయడం మాత్రమే కాదు యువతిని వివస్త్రను చేసి నగ్న పూజలతో క్షుద్ర తంతు చేసినట్టు క్లియర్ తెలుస్తుందన్నారు దర్దేపల్లి తాజా మాజీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్ సేట్.
క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా వున్నాయి. అర్ధరాత్రి ఐం హ్రీం క్రీం మంత్రాలను విన్న వాళ్లు..క్షుద్ర తంతును చూసిన వాళ్లూ వున్నారు. ఎవర్రా మీరంతా మా వూళ్లూ ఎందుకు మోపయ్యారని ప్రశ్నిస్తే..నల్లకోడిలా బలి ఇస్తామని బెదిరించారట. జనం మోపవ్వడంతో మంత్రగాళ్లు పరారయ్యారు. తమ ఊరికి ఏదో కీడు చేస్తున్నారనే భయంతో జనం వెంటపడి దాడి చేస్తే ..పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాల్సిన ముఖ్య విషయమే. అంతేకాదు మరో కోణం కూడా వుంది.
క్షుద్రపూజలు ఎవరి పని ఎందుకనే చర్చతో పాటు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇంత కథ జరగడం సంచలనంగా మారింది. ఈ మ్యాటర్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసిన పోలీసులు.. క్షుద్రపూజ కేటుగాళ్లను మడతేసేలా స్పెషల్ ఆపరేషన్ టేకప్ చేశారు. ఇక కాలాజాదు గాళ్లకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇలాంటి ఎగస్ట్రాలు ఎక్కడైనా కంటపడితే..భయపడాల్సింది లేదు. వెంటపడాల్సిన పని అసలే వద్దు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం. వాళ్ల కత ఖాకీలు చూసుకుంటారు. మూఢనమ్మకాలను అదనుగా చేసుకుని ముగ్గులోకి లాగే ఇట్టాంటి కేటుగాళ్లకు కొదవే లేదు. తస్మాత్ జాగ్రత్త
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





