Hijras Fighting: రోడ్ పై దారుణం గా కొట్టుకొన్న ట్రాన్స్ జెండర్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరందరూ బిక్షాటన విషయంలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన నంద్యాల్లో చోటు చేసుకుంది. భిక్షాటన విషయంలో నంద్యాలకు చెందిన హిజ్రా వర్గాల మద్య వివాదం గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఆ క్రమంలో తాజాగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఒకరిపై మరొకరు కారం చల్లుకుంటూ.. రాళ్ళతో దాడులకు దిగారు. ఇక్కడ భిక్షాటన చేసుకునే హక్కు మాకంటే మాకే ఉందని.. రెండు వర్గాలుగా మారి నడిరోడ్డుపై కొట్టుకున్నారు.
ఈ హిజ్రాలు తీవ్రంగా కొట్లాడుకుంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతే కాకుండా అటుగా వెళ్తున్న వారి దృష్టిని కూడా ఈ ఘటన ఆకర్షించింది. అయితే ఈ సంఘటన చూస్తున్న స్థానికులు వారిని ఆపడానికి ధైర్యం చేయలేదు. మాకెందుకులే అని దూరంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
నడిరోడ్డుపై ఇంత జరుగుతున్నా.. స్థానికులంతా ఆ ప్రాంతంలోకి చేరుకుని ఏం చేయాలో తెలియక సినిమా చూసినట్లు చూశారు. ఒకరిపై మరొకరు జుట్టు లాక్కుంటూ కొట్టుకున్నారు. దీంతో ఈ ఘర్షణ తీవ్రం కావడంతో చూపరులు బిక్కుబిక్కుమంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిజ్రాలు కొట్టుకున్న వీడియోలను అక్కడ ఉన్నవారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలో వైరల్గా మారాయి. చుట్టుపక్కలవారు పోలీసుల సహాయం కోసం బలవంతంగా పిలిచే స్థాయికి పరిస్థితి వచ్చింది.
స్థానిక పోలీస్ అధికారులు త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి పోలీసులు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also read
- శ్రీ కూర్మ జయంతి
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు





