పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కులాలు వేరు.. వేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పాడు యువతి తండ్రి.. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన పాపానికి ప్రియురాలు తండ్రి గొడ్డలితో దాడి చేసి, అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కులాలు వేరు.. వేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పాడు యువతి తండ్రి.. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు. కానీ.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు.. ఎలాగైనా ప్రియుడిని చంపాలని అమ్మాయి తండ్రి అనుకున్నాడు.. దీనికోసం ఓ పథకాన్ని రచించి దాన్ని అమలు చేశాడు..
ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు.. ఈ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు.. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్‌పై దాడి చేశాడు.. దీంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు, కుటుంబసభ్యులు.. సాయికుమార్ ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు.
అయితే, సాయికుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే..గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





