ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళను రేప్ చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్ దొరికినట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP Crime: ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో మహిళను అత్యంత కిరాతకంగా చంపేశారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుంటూరు ఛానల్ పక్కన దాదాపు 30 ఏళ్ల మహిళను రేప్ చేసి, గొంతుకోసి హతమార్చారు. ముళ్ళ పొదల్లో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు.
మెడపై కత్తితో పొడిచి..
ఈ మేరకు కొలనుకొండ సమీపంలోని స్థానికులు గుర్తుతెలియని మహిళ హత్యకు గురైందని సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా మహిళను అత్యాచారం చేసి దారుణంగా మెడపై కత్తితో పొడిచి చంపేసినట్లు ఆనవాళ్లు లభించాయి. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, తదితర వస్తువులు దొరికాయి. ఆమె సెల్ ఫోన్ కూడా గుర్తించాం. దాని ఆధారంగా వివరాలు సేకరిస్తాం. ప్రస్తుతం ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.
ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామేశ్వరరావు. చిన్నారులకు చాకెట్లు, డబ్బుల ఆశచూపి రేప్ కామేశ్వరరావు రేప్ చేసినట్లు తెలుస్తోంది.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





