SGSTV NEWS
Andhra PradeshCrime

AP SI: పవన్ ఇలాకాలో లంచాల దందా.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన SI


ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ.20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

AP SI: ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ. 20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.  దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

పక్కా సమాచారంతో రైడ్స్..
దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రైడ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ ,అతని పర్సనల్ డ్రైవర్ లను పట్టుబడ్డారు. ఈ సంఘటనపై  సంఘటన స్థలానికి చెరుకుని శాఖపరమైన విచారణ చేపట్టినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జిల్లాలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే మంటలను అదుపు చేశారు.  అయితే ఎంత వరకు నష్టం జరిగింది? ఎలా అగ్ని ప్రమాదం సంభవించిదనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాద సమయంలో శీతల గిడ్డంగిలో సుమారు రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం.

Also read

Related posts