రాజస్థాన్ ఝలావర్ జిల్లా బకానీలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక రవీనా సైన్ భర్త నాలుక కొరికిపడేసింది. తెగిన నాలుక ముక్కను పట్టుకొని భర్త కన్హయలాల్ సైన్ హాస్పిటల్కు వెళ్లాడు. డాక్టర్లు అతనికి చికిత్స చేసి నాలుక అతికించారు
ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. క్షణికావేశంలో చేసిన పనులకు తర్వాత బాధపడుతున్నారు. నువ్వా నేనా అని వివాదాలకు దిగి పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్లో భార్యభర్తల మధ్య అలాంటి గొడవే జరిగింది. వారి గొడవ కారణంగా ఆవేశంలో భార్య చేసిన పని భర్త హాస్పిటల్ పాలైయ్యాడు. రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణానికి చెందిన కన్హయలాల్ సైన్ (25), రవీనా సైన్ (23) ఇద్దరూ భార్యాభర్తలు. పట్టణానికి సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్ను ఏడాదిన్నర క్రితమే కన్హయలాల్ సైన్ వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య నిత్యం గొడవలే జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు.
భర్తతో గొడవపడిన రవీనా సైన్ కోపం పట్టలేకపోయిన భర్త నాలుకను కొరికిపారేసింది. నాలుకలో కొంత భాగం తెగిపోయింది. ఆ నొప్పితో భర్త గిలిగిలలాడిపోయాడు. కన్హయలాల్ సైన్ ఆ నాలుక ముక్కను పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీశాడు. అంతేకాదు నాలుక కొరిక తర్వాత భార్య గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కత్తితో మణికట్టును కోసుకునేందుకు ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఆమె దగ్గరున్న కత్తిని గుంజుకున్నారు. తెగిపోయిన నాలుకతో హాస్పిటల్కు వెళ్లిన భర్తకు డాక్టర్లు కుట్లు వేసి అతికించారు. బాధితుడు కన్హయ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం రవీనాపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బాధితుడు మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో అతడి నుంచి వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాలేదని చెప్పారు. భర్త స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు భార్యను అరెస్ట్ చేయనున్నారు.
Also Read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





