మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపు వ్యవహారంలో ఏపీ సీఐడీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 10న ఓ సారి నోటీసులు జారీ చేసింది సీఐడీ. ఈ నోటీసులకు సంబంధించి 12న ఇప్పటికే ఆయన విచారణకు హాజరయ్యారు. తొలిసారి విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు అని అభివర్ణించారు. పోర్టు యజమాని కేవీ రావుతో ముఖపరిచయం తప్పా ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. విక్రాంత్ రెడ్డి తనకు వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలున్నారు. అయితే ఓ మిత్రుడి ద్వారా ఈ కేసు గురించి కేవీరావుతో మాట్లాడించాన్నారు. ఓ అధికారి ఆదేశాలతోనే తన పేరు ఈ కేసులో ఇరికించినట్లుగా కేవీ రావు చెప్పారన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావుకు విక్రాంత్‌రెడ్డిని తాను పరిచయం చేయలేదున్నారు. ఈ విషయాన్నే సీఐడీ అధికారులకు వివరించినట్లు చెప్పారు.
Also read
- దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట
- రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్ చెక్ చేయగా..
- అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే
- కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
- నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ





