బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Fake Notes: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ.6 లక్షల నకిలీ నోట్లు..
ఈ మేరకు సూరత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన సురేష్ లాథిడియాపై ఇప్పటికే నకిలీ నోట్లకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాంటెడ్ నిందితుడి నుంచి సురేష్ లాథిడియా రూ.6 లక్షల నకిలీ నోట్లను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడని తెలిపారు. నిందితుడు ఈ నోట్లను బంగ్లాదేశ్ నుంచి కొనుగోలు చేశాడని సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఒక ప్రకటనలో తెలిపింది
పూణే ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి విజయ్ చౌహాన్ (27), సురేష్ లాథిడియా (55) లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ క్యాటరింగ్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారని, వారిద్దరి వద్ద రూ.9,000 విలువైన 18 నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు కూరగాయలు, పాన్ దుకాణాలలో నకిలీ నోట్లను నిజమైన నోట్లతో మార్పిడి చేసేవారని వెల్లడించారు.
ఇక పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా నివాసి తాహిర్ షేక్ నుండి రూ. 2 లక్షలకు రూ. 6 లక్షల విలువైన నకిలీ నోట్లను కొనుగోలు చేసినట్లు నిందితులు అంగికరించారు. ఈ కేసులో వాంటెడ్ నిందితుడు తాహిర్ షేక్ బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను కొనుగోలు చేశాడు. నకిలీ నోట్లతో పాటు ఒక డిటెక్టర్ యంత్రం, కొన్ని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
- రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే
- ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!
- 2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !





