కారు కింద తిష్ట వేసుకు కూర్చున్నది ఏంటో తెలుసా..? భారీ కొండచిలువ.. దీంతో ఉలిక్కిపడిన ఆ కుర్రాళ్ళు.. కొండచిలువను తీసే సాహసం చేయలేకపోయారు. సమీపంలో ఉన్న జూ వరకు మెల్లగా వెళ్లారు సహాయం కోసం. అర్ధరాత్రి కావడంతో ఫారెస్ట్ అధికారులు గానీ, జూ సిబ్బంది గాని అందుబాటులో లేరు. ఈలోగా నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు అటుగా వెళ్తున్నారు. సీఐ, ఎస్‌ఐ హరికృష్ణ వాళ్ల హడావుడిని చూసి ఆరా తీశారు.
సాగరనగరం.. వీకెండ్..! మరి బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయకపోతే ఆ కిక్కేముంటుంది.! కొంతమంది కుర్రాళ్ళు ఇన్నోవా కారులో బయలుదేరారు. సాగర్ నగర్ బీచ్‌కు వెళ్లి.. ఇన్నోవా కారును పార్క్ చేశారు. బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి దాటింది. తిరిగి వెళ్దామని అనుకున్నారు. కారు స్టార్ట్ చేయగానే ఏదో వింత శబ్దాలు వెనుక టైర్ కింద నుంచి వినిపించాయి. కుక్క గానీ, పిల్లి గానీ దూరి ఉంటుందని అనుకున్నారు. టార్చ్ లైట్ వేసి లోపలికి తొంగి చూశారు. అంతే.. అంతా షాక్..!
కారు కింద తిష్ట వేసుకు కూర్చున్నది ఏంటో తెలుసా..? భారీ కొండచిలువ.. దీంతో ఉలిక్కిపడిన ఆ కుర్రాళ్ళు.. కొండచిలువను తీసే సాహసం చేయలేకపోయారు. సమీపంలో ఉన్న జూ వరకు మెల్లగా వెళ్లారు సహాయం కోసం. అర్ధరాత్రి కావడంతో ఫారెస్ట్ అధికారులు గానీ, జూ సిబ్బంది గాని అందుబాటులో లేరు. ఈలోగా నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు అటుగా వెళ్తున్నారు. సీఐ, ఎస్‌ఐ హరికృష్ణ వాళ్ల హడావుడిని చూసి ప్రశ్నించారు. ఈలోగా డయల్ 100 కు కాల్ కూడా వెళ్ళింది.
దీంతో.. అప్పటికి ఇప్పటినా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. రంగంల్లోకి దిగిన కిరణ్ కుమార్.. చాకచక్యంగా కారు కింది భాగంలో వెనుక టైర్ల మధ్య తిష్ట వేసి కూర్చున్న కొండచిలువను బయటకు తీశారు. డ్రమ్ములో వేసి బంధించి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ ఒక్క ఫోన్ కాల్ తో ఘటన స్థలానికి చేరుకుని పామును రెస్కూ చేసిన కిరణ్ కుమార్‌ను అభినందించారు పోలీసులు, ప్రయాణికులు, స్థానికులు
Also read
- దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
- Crime News: సరూర్‌నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
- కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
- భార్యకు అదే పిచ్చి… భర్త ఏం చేసాడంటే!
- బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!