March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి


కాకినాడలో ఉంటున్న చంద్రశేఖర్ కన్న పిల్లలను దారుణంగా చంపేశాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని పిల్లలను కట్టేసి బకెట్‌ నీటిలో ముంచి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖ రాయడంతో ఈ విషయం బయటపడింది.

కన్న పిల్లలను కాపాడాల్సిన తండ్రే మృత్యువుగా మారి ఘోరంగా చంపేసిన దారుణ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.కాళ్లూ చేతులను తాళ్లతో కట్టి, నీళ్ల బకెట్లలో పిల్లల తలలను ముంచి తండ్రే చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని సుబ్బారావునగర్‌లో వానపల్లి చంద్రకిశోర్‌ ఉంటున్నాడు. ఇతను కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

భార్యను నమ్మించి ఇద్దరు పిల్లలను..
ఇతనికి భార్య తనూజ, ఇద్దరూ పిల్లలు జోషిల్‌ (7), నిఖిల్‌ (6) ఉన్నారు. అయితే పిల్లలు సరిగ్గా చదవడం లేదని వారిని ఇటీవలే స్కూల్ మార్పించారు. హోలీ సందర్భంగా చంద్రకిశోర్‌ శుక్రవారం భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు

ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్‌ చేసినా, ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తమ పిల్లలు రాణించడం లేరని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాశాడు. అయితే వీరికి ఎలాంటి సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు అయితే కాదని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Also read

Related posts

Share via