ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అతడు ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని అలాగే గగన్‌యాన్ ప్రాజెక్టు వివరాలు కూడా అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్.. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
2024లో అతడికి నేహా శర్మ అనే ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయమైంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ISI) కోసం పనిచేస్తోంది. ఈ విషయం రవీంద్రకు తెలియకుండా అతడితో ఆమె స్నేహం చేసింది. డబ్బుల ఆశ చూపించి వలపు వల విసిరి.. మిలిటరీ రహస్యలు సేకరించినట్లు విచారణలో తేలింది. రవీంద్ర ఆమె నెంబర్‌ను చంద్రన్ స్టోర్‌కీపర్ పేరుతో సేవ్ చేసుకున్నాడు. వాట్సాప్‌లో ఆమెకు కీలకమైన డ్యాకుమెంట్స్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు.
51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు చేసిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్ కమిటీ పంపిన సీక్రెట్ లేఖలు సంపాందించిన రవీంద్ర.. వాటిని ఆమెకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పాకిస్థాన్‌కు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సభ్యులతో కూడా అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అలాగే భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించి నిఘా సమాచారాన్ని పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రవీంద్రతో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ల వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు .
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





