SGSTV NEWS
CrimeNational

Lilavati Hospital: ముంబై లీలావతి హాస్పిటల్‌లో బాణామతి, క్షుద్రపూజలు.. ఉలిక్కిపడ్డ ఆర్ధిక రాజధాని..!



లీలావతి హాస్పిటల్‌లో బాణామతి కలకలం సృష్టిస్తోంది. ముంబైలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. ఓవైపు 15వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుండగానే ఆర్థిక రాజధానిలో అతిపెద్ద ఆసుపత్రి లీలావతిలో లేటెస్ట్‌గా చేతబడి ఎపిసోడ్‌ తెరపైకి వచ్చింది. ప్రాణాలు కాపాడాల్సిన అధునాతన ఆసుపత్రిలో అనాగరిక కాలాజాదూ ఎవరి పని ? ఎందుకోసం..?


లీలావతి హాస్పిటల్‌లో బాణామతి కలకలం సృష్టిస్తోంది. ముంబైలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. కార్పొరేట్‌ వైద్యానికి బ్రాండ్‌గా పేరున్న లీలావతి హాస్పిటల్‌లో అలా చేతబడి, బాణామతి జరిగిందా? క్షుద్రపూజల ఆనవాళ్లు, ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు లీలావతి కీర్తిలాల్‌ మెహతా మెడికల్‌ ట్రస్ట్‌ ప్రస్తుత ట్రస్టీ ప్రశాంత్‌ మెహతా. బాంద్రా కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ బ్లాక్‌ మ్యాజిక్‌ యాక్ట్‌ కింద కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ట్రస్టీ ఆఫీసులో చేతబడి చేశారని. పుర్రెలు, ముకలతో నిండి వున్న 8 కలశాలు సహా క్షుద్ర పూజకు సంబంధించిన వస్తువులను గుర్తించి పోలీసులకు అప్పగించామనిట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు.


లీలావతి హాస్పిటల్‌ వైద్యరంగంలోనే ఓ ఐకాన్‌. వీవీఐపీలు, సెలబ్రిటీలు ట్రీట్‌మెంట్‌ కోసం ఎక్కువగా లీలావతి హాస్పిటల్‌కే వస్తుంటారు. వైద్య పరంగా నెంబర్‌ వన్‌గా ఉన్నప్పటికీ, ట్రస్ట్రీల మధ్య విభేదాలతో లీలావతి వివాదాల ఫ్రేమ్‌లోకి వచ్చింది. వ్యవస్థాపక ట్రస్టీ కిషోర్‌ మెహతా 2002లో వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన టైమ్‌ ఆయన సోదరుడు విజయ్‌ మెహతాకు తాత్కాలికంగా ట్రస్ట్‌ బాధ్యతలు అప్పగించారు. అదే అదనుగా అతను తన కుటుంబసభ్యులను, బంధువులను ట్రస్టీలుగా నియమించుకుని కిషోర్‌ మెహతాను శాశ్వత ట్రస్టీగా తొలగించారనే వివాదాలు పీక్స్‌ వెళ్లాయి.

న్యాయపోరాటాల క్రమంలో 2016లో కిషోర్‌ మెహతా మళ్లీ శాశ్వత ట్రస్టీ అయ్యారు. 2024లో కిషోర్‌ మెహతా మరణంతో ఆయన కుమారుడు ప్రశాంత్‌ మెహతా ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తే నిధుల గోల్‌మాల్‌ బయటపడింది. విజయ్‌ మెహతా హయాంలో 1500 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందనే అభియోగాలపై మూడు కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా బ్లాక్ మేజిక్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.


కాలాజూదు కర్త కర్మ క్రియ పాత ట్రస్టీలనేని ప్రస్తుత ట్రస్టీ వర్గం ఆరోపిస్తోంది. ట్రస్టీ ప్రశాంత్‌ మెహతా, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసి క్షుద్ర పూజలు నిర్వహించారనే ఫిర్యాదుపై ఎంక్వయిరీ కూడా నడుస్తోంది. అయితే సంచలనం సృష్టించడానికే ఇలాంటి కథనాలని ఖండిస్తున్నారు పాత ట్రస్టీ వర్గం. బ్లాక్‌ మేజిక్‌ ఓ కట్టుకథ అని మాజీ ట్రస్ట్‌ విజయ్‌ మెహతా కుమారుడు చేతన మెహతా మండిపడ్డారు. కానీ మాజీ ట్రస్టీ సహా 17 మందిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయింది. ముంబైలోనే అతిపెద్ద ఆసుపత్రి అయ్యిన లీలావతిలో బ్లాక్‌ మేజిక్‌ వ్యవహారం ముంబైలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.

Also read

Related posts

Share this