ఇటీవల ఖైరతాబాద్, ఛాదర్‌ఘాట్‌లో బ్రోతల్ హౌస్‌లపై పోలీసులు ఆకస్మికంగా రెయిడ్ చేశారు. 18 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో విదేశీ యువతులు ..కొందరు మైనర్లను రెస్క్య చేశారు. బ్రోతల్ హౌస్ నిర్వహిస్తోన్న నిందితులను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూశాయి.
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు దూకుడు పెంచారు. కొద్ది రోజుల క్రితం బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేశారు. తాజాగా ఈ అక్రమ రవాణా రాకెట్ కేసులకు సంబంధించి హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 1.90 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ ఇలా వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించిన ముఠాలు.. వారితో వ్యభిచారం చేయించారు. కొద్దిరోజుల క్రితం పోలీసులు రైడ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. బంగ్లాదేశ్ నుంచి మహిళల అక్రమ రవాణా చేసినట్లు తేలింది. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేశారు పోలీసులు.
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి బంగ్లాదేశ్ యువతులను భారత్‌లోకి ఏజెంట్లు అక్రమంగా రవాణా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





