అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
Murder : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలతో భర్తలను చంపే క్రూరత్వం ఎక్కువైంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, భర్తతో శారీరక సుఖం లేకపోవడం, భర్త మద్యానికి బానిసవ్వడం వంటి కారణాలతో మహిళలు మరోకరితో శారీరక సంబంధాలు నెరపుతున్నారు. ఈ క్రమంలో ఏదో ఒకరోజు ఆ విషయం బయటకు పొక్కి కుటుంబంలో గొడవలకు దారి తీస్తుంది. దీంతో అడ్డుగా ఉన్న భర్తను హత్యచేయడానికి కూడా వారు వెనుకాడటం లేదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటచెరువుకు చెందిన పుట్టల నరేశ్ గతనెల 1న మృతి చెందాడు. కాగా కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పుట్టల చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పేటచేరువు స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు
కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతుడు నరేశ్ భార్య రజితకు, ఈమె బావ గద్దల సాంబశివరావుకు మధ్య అక్రమ సంబంధం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో తన భర్త పుట్టల నరేశ్ అడ్డు తోలగించుకోవాలని రజిత, సాంబశివరావు ఇద్దరూ కలిసి పథకం రచించారు. స్నేహితుడు తాటి నరేశ్ సహాయంతో ముందస్తు పథకం ప్రకారం పుట్టల నరేశ్ కు మద్యం బాటిల్ లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. ఆ మద్యం తాగిన రజిత భర్త అస్వస్థతకు గురై చనిపోయాడు. అయితే నరేష్ తో పాటు అదే మద్యాన్ని సేవించిన పెటచెరువుకు చెందిన బొజ్జా వెంకటేశ్వర్లు ఆరోగ్యం కూడా క్షీణించింది. అయితే అది మద్యం మూలంగానే జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ, అసలు విషయం తెలియడంతో నిందితులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్, పుట్టల రజితను పోలీసులకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read
- Vizianagaram: జాతరలో ఘోరం… లేడీ ఎస్సై జుట్టు పట్టుకుని వేధించిన పోకీరీలు.. వీడియో వైరల్
- Telangana: దురదృష్టం అంటే ఇదే.. పాములు పట్టేవాడు పాము కాటుకే బలయ్యాడు..
- Andhra Pradesh: రోడ్డుపై ఎస్సై యవ్వారాలు.. ఎందుకో అనుమానం వచ్చి చెక్ చేయగా..!
- విజయసాయిరెడ్డి నోట శేఖర్‌రెడ్డి మాట.. ఇంతకీ.. ఎవరీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ?
- Telangana: చావు ఇంటికి వచ్చి మద్యం తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి.. ఆ తర్వాత బయడపడ్డ షాకింగ్ నిజం