March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

మెదక్: వీడెక్కడి సైకోరా సామీ.! నువ్వులేక నేనులేనన్నాడు.. చివరికి నమ్మించి నట్టేట ముంచాడు

 

ఆమెది హాయిగా సాగిపోతున్న వైవాహిక జీవితంలోకి తుఫాన్‌లా ఎంటర్ అయ్యాడు. నువ్వులేక నేనులేనన్నాడు.. నువ్వు నాకు కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఈ వ్యవహారమంతా ఆమె భర్తకు తెలియడంతో విడాకులకు దారి తీసింది. తీరా ప్రేమించాడు కదా.. పెళ్లి చేసుకుంటాడెమోనని అతడి దగ్గరకు వెళ్తే..


సోషల్ మీడియా వల్ల ఎన్నో కుంటుంబాల్లో గొడవలు వస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మరొకరు దూరడం వల్ల, ఎంతోమంది దంపతులు విడిపోతున్నారు. ఆలోచన లేని పనుల వల్ల జీవితాంతం కలిసిమెలిసి సాగిపోవాల్సిన కాపురాలు మధ్యలోనే విడాకుల వరకు వెళ్తున్నాయి. పెళ్లి అయిన మహిళకు తరచూ మెసేజ్‌లు చేస్తూ.. నువ్వు నాకు కావాలి అని చెప్పి.. నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పి.. ఆమె జీవితాన్ని ఆగం చేశాడు ఓ మూర్ఖుడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన జజ్జురి దివ్య.. గొల్ల అనిల్ కొన్ని ఏళ్లుగా ప్రేమించుకున్నారు.. కాగా వీరి ప్రేమను ఒప్పుకోని అమ్మాయి తల్లిదండ్రులు దివ్యకు కొల్చారంకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు. హాయిగా సాగిపోతున్న దివ్య జీవితంలోకి మళ్లీ వచ్చాడు అనిల్.


దివ్య నెంబర్ తెలుసుకుని తరచూ మెసేజ్‌లు చేస్తూ.. నువ్వు నాకు కావాలి.. నువ్వు లేక నేనులేను అని మెసేజ్‌లు చేశాడు. ఈ మెసేజ్‌లు కాస్తా దివ్య భర్త చూడటంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అది విడాకుల వరకు వెళ్లింది. దీంతో దివ్య జరిగిన విషయాన్ని అనిల్‌కి చెప్పడంతో నేను పెళ్లి చేసుకుంటానని దివ్యకు మాట ఇచ్చాడు. ఇదే విషయాన్ని కొద్దిరోజుల తర్వాత అనిల్‌ను అడిగింది దివ్య. ఇక అప్పటి నుంచి అనిల్ దివ్యకు కనబడకుండా ముఖం చాటేశాడు. ఇది గమనించిన దివ్య కుటుంబ సభ్యులు, కూకుట్లపల్లిలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.


పంచాయతీకి వచ్చిన గొల్ల అనిల్ 20 లక్షల కట్నంతో పాటు, ఒక ఎకరం పొలం ఇస్తేనే వివాహం చేసుకుంటానంటూ చెప్పగా.. దివ్య షాక్‌కి గురైంది. ఇక చేసేది ఏమిలేక, దివ్య తల్లి కట్నం మాత్రమే ఇస్తానంటూ, తన కూతురిని వివాహం చేసుకోవాలని ఒప్పంద పత్రం చేసుకున్నారు. అయినా కూడా అనిల్ తీరులో మార్పు రాలేదు. దివ్య కుటుంబ సభ్యులు అనిల్‌పై ఒత్తిడి తేవడంతో.. నేనే మీకు 26 లక్షలు ఇస్తానని, దివ్యను మాత్రం వివాహం చేసుకోనంటూ ముఖం చాటేసాడు. అనంతరం అనిల్ బంధువుల వద్ద ఉంటున్నాడని.. నిన్న సాయంత్రం ఇంటికి అనిల్ వచ్చాడని సమాచారం తెలుసుకున్న దివ్య తల్లితో.. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అనిల్ తల్లి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళింది. అనిల్‌తో వివాహం చేయాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన తెలిపింది దివ్య. ఇదే విషయంలో గతంలో పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది

Also read

Related posts

Share via