అమలక ఏకాదశి మరుసటి రోజు వచ్చే ద్వాదశిని నృసింహ ద్వాదశిగా జరుపుకుంటాం. నరసింహుడు అవతరించిన రోజుగా పేర్కొనే నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అను కూడా అంటారు. ఈ కథనంలో నరసింహ ద్వాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం తదితర వివరాలను తెలుసుకుందాం.నృసింహ ద్వాదశి విశిష్టత
వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో నృసింహ ద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహుని ఈ రోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం.నృసింహ ద్వాదశి ఎప్పుడు
మార్చి 10వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి 9:53 నిమిషాలకు మొదలై మార్చి 11వ తేదీ మంగళవారం ఉదయం 9:29 వరకు ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి మార్చి 11వ తేదీనే నృసింహ ద్వాదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం.నృసింహ ద్వాదశి రోజు ఏమి చేయాలి
నృసింహ ద్వాదశి రోజు గంగా స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగి పోతాయని విశ్వాసం. నరసింహ ద్వాదశి రోజు వైష్ణవ ఆలయాలను సందర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం. ఈ రోజు నరసింహుని దర్శించడం, అభిషేకం అర్చనలు జరిపించడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజు పూజామందిరంలో నృసింహస్వామి చిత్రపటాన్ని ఉంచుకొని తులసీదళాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం. అనంతరం స్వామికి వడపప్పు, పానకం, కొబ్బరికాయలు, అరటిపండ్లు, చక్రపొంగలి, పులిహోర వంటి ప్రసాదాలను సమర్పించాలి.
మహిళలు ఈ పూజ చేయాలి
నృసింహ ద్వాదశి రోజు మహిళలు గోవును, సీతాదేవిని, విష్ణువు అవతారమైన నరసింహుని పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం. గోవింద ద్వాదశిగా పేర్కొనే నృసింహ ద్వాదశిని కొన్ని ప్రాంతాల్లో పండుగల జరుపుకుంటారు.నృసింహ ద్వాదశి పూజాఫలం
భక్తిశ్రద్ధలతో నృసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించే వారు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. నరసింహుని ఆశీస్సులతో కష్టాలు, భయాలు తొలగిపోతాయి. నరసింహస్వామి ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగల ధైర్యం లభిస్తుందని పెద్దలు అంటారు.గ్రహదోష నివారణ
జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణభారం వంటి బాధలు పట్టి పీడిస్తాయి. భక్తిశ్రద్ధలతో నృసింహ ద్వాదశిని జరుపుకుంటే కుజగ్రహ దోష ఫలంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.రానున్న నృసింహ ద్వాదశి రోజు మనం కూడా నరసింహస్వామిని పూజిద్దాం. తరిద్దాం. ఓం నమో నారసింహాయ నమఃముఖ్య
