ఉత్తరాఖండ్ దేవత భూమి. ఇక్కడ అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నదులు, పర్వతాలున్నాయి. ఇక్కడ గంగా దేవి జన్మ స్థలంగా పిలవబడిన ముఖ్వా లేదా ముఖ్బా గ్రామం ఉంది. ఈ గ్రామం ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ముఖ్వా ఆలయం అని పిలుస్తారు. నమ్మకం ప్రకారం ఈ గ్రామం గంగా దేవి మాతృభూమిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
భారతదేశం ఆధ్యాత్మికత నెలవు. అనేక పురాతన, అద్భుత దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఈ ఆలయం పేరు ముఖ్వా. ముఖ్వా పర్వతాలపై ఉన్న ఒక అందమైన గ్రామం. రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ముఖ్వా గ్రామం ఉంది. ఈ ముఖ్వా గ్రామాన్ని ముఖిమత్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆలయంలో పూజలు చేయడంతో ఈ ఆలయం ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటి అని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్వా ఆలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
మఖ్వాని గంగా దేవి జన్మ భూమి అని ఎందుకు పిలుస్తారు?
వాస్తవానికి ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం మాతంగ ఋషికి పుట్టినిల్లు. ఈ గ్రామానికి మాతంగ ఋషి పేరు మీదుగా మఖ్వా అని పేరు వచ్చింది. మాతంగ ఋషి తపస్సు చేసి.. శీతాకాలంలో ఈ ప్రదేశంలోనే కొలువై ఉండమని గంగా దేవి నుంచి వరం పొందాడు. ఈ ప్రదేశాన్ని గంగా మాత జన్మభూమి అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో ఈ గ్రామం గంగా దేవి నివాసంగా ఉంటుందని చెబుతారు.
అంతేకాదు మార్కండేయ మహర్షి ఈ ముఖ్వా గ్రామంలో తపస్సు చేసినట్లు పురాణ కథనం. ఈ గ్రామ సమీపంలోని మార్కండేయ గ్రామంలో మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణాన్ని రచించాడు. ప్రసిద్దిగాంచిన మహా మృత్యుంజయ మంత్రాన్ని సమస్త మానవాళికి అందించాడు
ఈ ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది?
శీతాకాలం ప్రారంభానికి ముందు గంగా దేవి విగ్రహాన్ని గంగోత్రి ధామ్ నుంచి ముఖ్వా గ్రామానికి భక్తుల ఊరేగింపుగా తీసుకువస్తారు. శీతాకాలంలో గంగోత్రి ధామ్‌లో భారీ హిమపాతం ఉంటుంది. దీంతో గంగోత్రి ఆలయ తలుపులు మూసివేస్తారు. అప్పుడు గంగా దేవి విగ్రహాన్ని ముఖ్వాలోని ముఖింనాథ్ ఆలయానికి తీసుకొస్తారు. ఈ గ్రామం గంగా మాత శీతాకాల నివాసం. గంగాదేవిని 6 నెలల పాటు ఇక్కడే ఉంచి పూజలు చేస్తారు. ఈ గ్రామం గంగా మాత నివాసం. ఆమె విగ్రహాన్ని ఈ గ్రామానికి తీసుకువచ్చినప్పుడు, స్థానిక ప్రజలలో చాలా ఉత్సాహం కనిపిస్తుంది
ముఖ్వా ఆలయ ప్రాముఖ్యత
ఆరు నెలల పాటు ముఖ్వా గ్రామంలో గంగా దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. నమ్మకాల ప్రకారం ఇక్కడ గంగా దేవిని పూజించే వారి కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని.. సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ముఖ్వా గ్రామంలో గంగా మాతను పూజించే సంప్రదాయం చాలా పురాతనమైనది.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
ముఖ్వా ఆలయాన్ని సందర్శించాలంటే మొదట రిషికేశ్ చేరుకోవాలి. దీని తరువాత రిషికేశ్ నుంచి ఉత్తరకాశి వెళ్ళాలి. తరువాత అక్కడ నుంచి హర్షిల్ వ్యాలీకి. ఈ ఆలయం దేశ రాజధాని ఢిల్లీకి దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది.
