ఏపీ అనంతపురం తిలక్‌నగర్‌కు చెందిన భారతి పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రామాంజనేయులే ఆమెను ఉరేసుకుని చనిపోవాలని బెదిరించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి, అతని పెద్ద అల్లుడు మారుతిని కూడా అరెస్ట్ చేశారు.
Crime: ఏపీ అనంతపురం జిల్లాలో జరిగిన భారతి పరువు హత్య కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన త్రండి తుపాకుల రామాంజనేయులే కూతురిని ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఈ మర్డర్ కేసులో రామాంజనేయులు పెద్దల్లుడు మారుతి హస్తం కూడా ఉన్నట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసులు తెలిపారు. భారతి తండ్రితోపాటు ఆమె బావను అరెస్ట్ చేయగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్చరించినా వినని భారతి..
ఈ మేరకు డీఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్‌కు చెందిన రామాంజనేయులుకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. తిలక్ నగర్ లోనే టిఫెన్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కూతురు భారతి.. అదే గ్రామానికి చెందిన యశ్వంత్ అనే అబ్బాయిని 5ఏళ్ల నుంచి ప్రేమిస్తోంది. ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు హెచ్చరించారు. మరో కులం కాబట్టి మనకు కుదరదని, మంచిమాటతో చెప్పినపుడు మానుకోవాలన్నారు. అయినా భారతి వినలేదు. చస్తానుగాని యశ్వంత్‌ను మరచిపోనని చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి రామాంజేయులు.. కూతురిని చంపాలని ఫిక్స్ అయ్యాడు. ఆటో డ్రైవర్ అయిన తన పెద్ద అల్లుడు మారుతి సాయంతో హత్యకు ప్లాన్ చేశాడు.
దర్గా వద్దకు తీసుకెళ్లి..
మార్చి 1న మారుతిని ఇంటికి పిలిచాడు. భారతీ పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, తాడు, పెట్రోల్ తోపాటు ఆమెను కూడా బలవంతంగా ఆటోలో కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి దర్గా వద్దకు తీసుకెళ్లారు. చివరిసారి మరోసారి హెచ్చరించారు. కానీ భారతి తన అభిప్రాయం మార్చుకోనని చెప్పింది. దీంతో అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కొమ్మకు ఉరివేసుకోవాలని బెదిరించారు. మరోమార్గం లేకపోవడంతో భారతి ఉరేసుకుని చనిపోయింది. వెంటనే మృతదేహాన్ని కిందికి దించి పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆమె సర్టిఫికెట్స్, ఆధార్ ఇతరత్రా వస్తువులను మంటల్లో కాల్చేశారు. 4 రోజుల తర్వాత రామాంజనేయులు స్వయంగా లొంగిపోయాడు. అయితే అల్లుడు మారుతిని కేసు నుంచి తప్పించాలని చూశాడు. కానీ విచారణలో అతనిపేరుకూడా బటపెట్టడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆటో, పెట్రోల్ క్యాన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసులు తెలిపారు.
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా