కుయ్..కుయ్..కుయ్‌మనే సైరన్ వినగానే ఎవ్వరికైనా ముందు గుర్తొచ్చేది అంబులెన్స్. ఆ సైరన్ వినగానే ఎవరైనాసరే అలర్ట్ అవుతారు. ఎవరో ప్రమాదంలో ఉన్నారు.. ఎమర్జెన్సీగా ఆస్పత్రికి తరలిస్తున్నారని భావిస్తాం. రోడ్డుపై ఉంటే పక్కకు జరిగి అంబులెన్స్‌కు దారిస్తాం. అది మానవీయత. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అలాంటి అంబులెన్స్‌లను అడ్డం పెట్టుకుని కొందరు ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు పొడుస్తున్నారు.
అంబులెన్స్ అంటే సకాలంలో హాస్పిటల్‌కు చేర్చి ప్రాణాలు కాపాడే సంజీవిని. ఫోన్‌చేసిన 20 నిమిషాల్లోనే కుయ్..కుయ్..కుయ్‌మంటూ స్పాట్‌కి వస్తుంది అంబులెన్స్. కానీ, ఇప్పుడు అంబులెన్స్ సైరన్ వింటే అనుమానించాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకు కారణం ..డ్రైవర్లు, అంబులెన్స్ నిర్వాహాకులు. అవును, టీవీ9 అండ్ హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఇది బయటపడింది. ఆపద్బాంధువుల్లా ఆదుకోవాల్సిన వాళ్లు.. అంబులెన్స్‌లను దుర్వినియోగం చేస్తూ టీవీ9 నిఘా కెమెరాకి చిక్కారు. దీంతో కదిలిన హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం జంటనగరాల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవించి తాగి వాహనం నడిపాడు. అంబులెన్స్‌లలో పేషెంట్లు లేకున్నా సరే సైరన్ వేసుకుని రోడ్లపై ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు కొందరు అంబులెన్స్ డ్రైవర్లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో నిబంధను ఉల్లంఘించే అంబులెన్స్‌లపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
అంబులెన్స్‌లో పేషెంట్లు ఉంటే మాత్రం పోలీసులు వారిని పంపించేస్తున్నారు. ఒకవేళ అంబులెన్స్‌లో పేషెంట్లు లేకున్నా సైరన్ వేసుకుంటూ వెళ్తే మాత్రం అంబలెన్స్ డ్రైవర్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. అంబులెన్స్‌లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో ఒక అంబులెన్స్ డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేశారు. ఆపై అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే ఆశ్చర్యంగా అంబులెన్స్ నడుపుతున్న డ్రైవర్ కు 120 శాతం మద్యం సేవించినట్లు వచ్చింది.
దీంతో అంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసులు అడ్డుకున్నారు డ్రైవర్ హఫీజ్‌గా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యంగా మద్యం సేవించే వాహనం నడపటంతో పోలీసులు సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే హఫీజ్ నడిపిన అంబులెన్స్ పోలీసులు సీజ్ చేశారు..
గత మూడు రోజుల నుండి వరుసగా అంబులెన్స్‌లపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అంబులెన్స్ లో ఎలాంటి పేషెంట్ లేకున్నా సరే సైరన్ వేసుకుంటూ ట్రాఫిక్ ను తప్పించుకుని ఒక టీ కొట్టు వద్ద ఆపి బజ్జీలు కొనుక్కున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో తర్వాత సదరు అంబులెన్స్ డ్రైవర్లపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక, తాజాగా అలాంటి అంబులెన్స్ డ్రైవర్ల పైన పోలీసులు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా