అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీస్ చికిత్స పొందుతు మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె భర్త స్టీల్స్టాంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు.
దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





