March 12, 2025
SGSTV NEWS
Andhra Pradesh

సిఐడి మాజీ చీఫ్‌ పివి సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌




అమరావతి : సిఐడి మాజీ చీఫ్‌ పివి సునీల్‌కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటువేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును గతంలో వేధించిన కేసులో సునీల్‌కుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, జార్జియా, స్వీడన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యుకె లాంటి దేశాలకు వెల్లడంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేవిధంగా ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లవద్దని సునీల్‌కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘనతోపాటు క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Also read

Related posts

Share via