తన కొడుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటాడు అనుకుని ఆశగా ఇంటికి వెళ్లిన రాంజీకి.. మరో రెండు గంటల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. మీ మెడికల్ రిపోర్ట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పడి ఉన్నాయి. మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో సారాంశం. నరసింహులు అండ్ టీం కి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ అక్కడ ఎందుకు వెళ్లాయి అనేదానిపై కంగారు పడ్డాడు రాంజీ.
ఆశపడిన వాళ్లని అడ్డంగా దోచుకునే మోసగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ.. అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ కుటుంబాన్ని ఆశపెట్టి వసూలు చేసి పారిపోయారు నకిలీ డాక్టర్లు. అనారోగ్యంతో ఉన్న బాలుడికి ఆదుకుంటామని చెప్పి వైద్యుల వేషంలో మాట కలిపి మోసగించారు. ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పినా… ట్రాప్ చేసి లక్ష లాగేశారు. వాళ్ళ మాటల్లో పడి కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని లక్ష సమకూర్చి ఇస్తే.. ఫోన్ స్విచ్ ఆఫ్..!
విశాఖ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలోనే ఉప్పరపేటకు చెందిన దూసి రాంజీ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. 2018 లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో ఐదేళ్ల చిన్న కొడుకు మోక్షిత్ రామ్ చిన్నప్పుడు నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కొంతకాలం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయించిన.. ఆ తర్వాత శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి విశాఖ తీసుకెళ్లాలని సూచించారు. మోక్షిత్ కు విశాఖ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. విశాఖలోని బంధువుల ఇంట్లో ఉంటూ.. మోక్షిత్ కు వైద్యం చేయించేవారు.
కొంపముంచిన దాతల కోసం ప్రకటన..!
ఈలోగా రాంజీ అప్పులు కూడా చేయడంతో.. కొడుకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాల్సిందిగా దాతల కోసం ఫిబ్రవరి 22న ప్రకటన ఇచ్చాడు తండ్రి. దీంతో ఫిబ్రవరి 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు డాక్టర్ నరసింహులుగా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడు. బాలుడి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తన దగ్గరకు ప్రభుత్వం నుంచి చేరాయని.. ఓసారి కేజీహెచ్ కు వచ్చి కలవాలని సూచించాడు. అతను చెప్పినట్టుగానే రాంజీ కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన డాక్టర్ నరసింహులు అని చెప్పుకున్న ఆ ఆగంతకుడు.. తన అసిస్టెంట్ను పంపిస్తున్నామని చెప్పాడు.
ఈ లోగా ఓ వ్యక్తి వైద్యుడు వేషంలో వచ్చి తన పేరు డాక్టర్ ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. కేజీహెచ్ లో పీజీ డాక్టర్ అని చెప్పుకుంటూ మాటలు కలిపాడు. రాంజీని కేజీహెచ్ సూపరిండెండెంట్ ఆఫీస్ వద్దకు తీసుకెళ్లాడు. బయట వెయిట్ చేయాలని చెప్పి.. హడావిడిగా అటు ఇటు తిరిగాడు. డాక్టర్ ప్రవీణ్ గా చెప్పుకునే ఆ వ్యక్తి కాసేపటికి మళ్ళీ రాంజీ దగ్గరకు వచ్చాడు. లక్ష రూపాయలు రెడీ చేసుకుంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుందని బాధితుడిని నమ్మించాడు. ఇంటికి వెళ్ళినా బాధితుడికి మళ్లీ డాక్టర్ నర్సింహులుగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు. లక్ష పట్టుకుని అర్జెంటుగా కేజీహెచ్ పిల్లల వార్డు వద్దకు రావాలని సూచించాడు. దీంతో రాంజీ లక్ష రూపాయల పట్టుకుని కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ తిష్ట వేసుకున్న నరసింహం.. కాస్త దూరంలో ఉన్న డ్రైవర్ కు క్యాష్ ఇచ్చి వెళ్లాలని సూచించాడు. నరసింహం సూచించినట్టుగానే లక్ష రూపాయలను కారు డ్రైవర్ కు ఇచ్చి వెళ్లిపోయారు బాధితుడు.
ఇంటికి వెళ్లిన రెండు గంటలకే మరో కాల్
తన కొడుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటాడు అనుకుని ఆశగా ఇంటికి వెళ్లిన రాంజీకి.. మరో రెండు గంటల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. మీ మెడికల్ రిపోర్ట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పడి ఉన్నాయి. మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో సారాంశం. నరసింహులు అండ్ టీం కి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ అక్కడ ఎందుకు వెళ్లాయి అనేదానిపై కంగారు పడ్డాడు రాంజీ. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి మెడికల్ రిపోర్ట్స్‌ను కలెక్ట్ చేసుకున్నాడు. వెంటనే అక్కడ నుంచి నర్సింహులుకు ఫోన్ చేశాడు. కాల్ అటెండ్ చేసిన నరసింహులు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఎంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి.. ఇక తన మోసపోయిన అని గుర్తించిన రాంజీ.. వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
రెండు సెక్షన్ల కింద కేసు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
బాధితుడు రాంజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. 318(4), 319(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు వన్ టౌన్ సిఐ జీడి బాబు
Also read
- Telangana: దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
- Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్