March 12, 2025
SGSTV NEWS
Crime

Roja : నెక్ట్స్ రోజానే అరెస్ట్.. రసవత్తరంగా ఏపీ పాలిటిక్స్!


ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.  వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్యనాయ‌కుల‌పై  నోరు పారేసుకున్న నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్‌తో  నెక్ట్స్ ఎవరన్నది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.  వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్యనాయ‌కుల‌పై  నోరు పారేసుకున్న నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్‌తో  నెక్ట్స్ ఎవరన్నది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.  లిస్టులో ప్రధానంగా కొంతమంది కీలక నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లిస్టులో మాజీ మంత్రి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంటూ చర్చ నడుస్తోంది.  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు రోజా, కొడాలి నాని, అనిల్, పేర్ని నాని. 

అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లపై  తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా. ఆమెపై టీడీపీ, జనసేన క్యాడర్ తీవ్ర ఆగ్రహాంతో ఉంది. ఈ నేపథ్యంలో పోసాని తరువాత త్వరలో రోజా అరెస్ట్ కావడం ఖాయమంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. 

రెచ్చిపోయి మాట్లాడిన రోజా

వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ లపై రెచ్చిపోయి మాట్లాడారు.  అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలు కూడా దిగారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది.  రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కామ్ జరిగినట్లుగా అప్సట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై  జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆత్యాపాత్యా చీఫ్‌ ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు కూడా  చేశారు. ఈ క్రమంలో రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకి వచ్చాయి.

Also read

Related posts

Share via