అనుమానాస్పద స్థితిలో సినీ కార్మికుడు మృతి చెందిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో సినీ కార్మికుడు మృతి చెందిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పనివెల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ (55), ఇందిరమ్మ దంపతులు కుమార్తెతో కలిసి ఫిలింనగర్ లోని మాగంటి కాలనీలో నివాసముంటున్నారు. హుస్సేన్ ఇంటికెళ్తూ.. సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అతన్ని లోపలికి ఎవరైనా రమ్మన్నారా? వెళ్లిన తర్వాత లోపల ఏం జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. తలకు భవనంలో లోపల ఉన్న సజ్జ తగిలిందని చెబుతున్నారు. సజ్జ తగిలిన చోటే హుస్సేన్ మృతదేహం పడి ఉంది. కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న భవన యజమాని ప్రహరీ లోపల ఉన్న మృతదేహాన్ని హుస్సేన్ ఇంటికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్ తల వెనుక మూడు గాయాలు, మోకాలికి, ఎడమ కంటికి గాయమైనట్టు గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా





