March 13, 2025
SGSTV NEWS
HealthLifestyle

Mint leaves: ఈ ఆకులు రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే.. జీవితంలో డాక్టర్‌తో పనే ఉండదు!

 

వేసవి కాలంలో అధిక వేడి కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుదీనా బలేగా ఉపయోగపడుతుంది. పుదీనాలోని ఔషధగుణాల కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేధంలో దీనిని ఉపయోగిస్తున్నారు. దీని ముఖ్యమైన ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి..


శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రారంభముతోంది. అధిక వేడి కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో అలెర్జీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఇంట్లోనే కొన్ని నివారణల ద్వారా శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు మీ రోజువారీ ఆహారంలో పుదీనా చేర్చుకోవాలని చెబుతున్నారు. తద్వారా ఈ రకమైన సమస్యలన్నీ నివారించవచ్చట. పుదీనాలోని ఔషధగుణాల కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేధంలో దీనిని ఉపయోగిస్తున్నారు. దీని ముఖ్యమైన ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. పుదీనా ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..


వైద్యుల అభిప్రాయం ప్రకారం.. పుదీనా ఆరోగ్యకరమైన మూలిక. దీన్ని వాడటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పుదీనా ఆకులలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఆకులలో ఉండే పోషకాలు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. దీని రసం చేదుగా ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మీరు దీని రసం తాగలేకపోతే, రెండు, మూడు తాజా పుదీనా ఆకులను నమిలి తినవచ్చు.

పీరియడ్స్‌ సమయంలో కడుపు నొప్పికి ఉపశమనం
సాధారణంగా పుదీనా ఆకులను రోజుకు రెండుసార్లు తింటే సరిపోతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండి, గ్యాస్, కడుపు నొప్పితో బాధపడేవారికి పుదీనా ఆకులు సంజీవనిగా పనిచేస్తాయి. ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పుదీనా ఆకులు అమ్మాయిల్లో వచ్చే పీరియడ్స్‌ సమస్యలకు, కడుపు నొప్పి, మంట, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. నోటి నుండి ఎప్పుడూ దుర్వాసన వస్తుంటే, పుదీనా ఆకులు ఈ సమస్యకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల నోటిలోని క్రిములు నశిస్తాయి. దుర్వాసన రాదు. పుదీనా మార్కెట్లలో దొరుకుతుంది. అలాగే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఉదయం మూడు లేదా నాలుగు తాజా పుదీనా ఆకులను నమిలితే ఆరోగ్య సమస్యలు మీకు దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Also read

Related posts

Share via