విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘పోలీసులు తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా’ అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
AP News: విజయవాడ వ్యభిచార గృహంలో అడ్డంగా బుక్కైన వైసీపీ నేత శంకర్ నాయక్ తన వీడియోలు సోషల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరు వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని, ఒకరోజులోనే తన పేరు నాశనం చేశారంటూ అసహనం చెందారు. అంతేకాదు పోలీసులను మీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
భార్య సూసైడ్..
స్పా సెంటర్లో దొరికిన నా వీడియోలను ఎందుకు రిలీజ్ చేశారు. మంచం కింద దాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని వల్ల మా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తోంది. నా పేరు, ప్రతిష్టలు దెబ్బతినేలా చేశారు. ఇదంతా కావాలనే చేశారని నాకు తెలుసు. మీ అంతు చూస్తాం అంటూ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా సోమశంకర్ నాయక్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడ స్పా సెంటర్ పై పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 10 మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు. అందులో శంకర్ నాయక్ ఒకడు. కాగా.. విటుల నుంచి పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకొని, స్టేషన్ బెయిలిచ్చి విడుదల చేశారు. ఇక శంకర్‌నాయక్‌ను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం అధికాకరిక ప్రకటన విడుదల చేసింది.
Also Read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





