March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: పోలీస్‌తో అక్రమ సంబంధం.. పసి పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన తల్లి!


తెలంగాణ డోర్నకల్‌లో మరో ఘోరం జరిగింది. ఓ పోలీస్ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మంగళ్ తండాకు చెందిన వితంతువు ఉషా.. తన ఇద్దరు పసి పిల్లల అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు తాగించింది. నిత్యశ్రీ (05) చనిపోగా అబ్బాయి వరుణ్ తేజ(07) బతికి బయటపడ్డాడు

TG Crime: తెలంగాణలో మరో ఘోరం జరిగింది. ఓ తల్లి అమ్మతనానికే అవమానం కలిగించేలా ప్రవర్తించింది. తొమ్మిది నెలలు మోసి కని పెంచుతున్న తల్లే తన బిడ్డల పాలిట మ్యత్యువైంది. ప్రియుడి మోజులో పడి ఇటీవలే కట్టుకున్న వాడిన కడతేర్చిన ఆ రాక్షసి.. చివరికి తన సుఖానికి అడ్డొస్తున్నారనే నెపంతో పిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపేసింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ పిసిపిల్లలకు విషమిచ్చి హతమార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడే ఈ ఘటన మహాబూబాబాద్ డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.



పోలీస్ తో అక్రమ సంబంధం..
మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్‌(30), ఉషాలకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05), అబ్బాయి వరుణ్ తేజ (07) ఉన్నారు. అయితే 4 నెలల కిందట వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అత్తింట్లోనే ఉంటున్న ఉషా.. కొంతకాలంగా ఓ పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి సృహతప్పి పడిపోయారు. వాంతులతోపాటు విరోచనాలు కావడంతో వెంకటేష్‌ తల్లి కంగారుపడిపోయింది. ఏం జరిగిందని ప్రశ్నించగా అమ్మ ఉషా కూల్‌డ్రింక్‌ తాగించిందని చెప్పారు. వెంటనే బాబాయ్‌ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఎలుకల మందు తాగి…
పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉషాను బంధువులంతా నిలదీయగా కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు అంగీకరించింది. ఆ భయంతోనే ఉషా కూడా ఎలుకల మందు తాగింది. ఆమెను గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే రెండు వారాల తర్వాత వరుణ్‌తేజ్‌ కోలుకోగా నిత్యశ్రీ చనిపోయింది. నిత్యశ్రీ పోస్టుమార్టం తర్వాత డోర్నకల్‌ సీఐ బీ రాజేశ్‌ కుటుంబ సభ్యులకు డెబ్ బాడీనీ అప్పగించే క్రమంలో బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉషా కావాలంటూ ఆంబులెన్స్‌ ముందు ధర్నా చేశారు. ఇక వెంకటేష్ తమ్ముడు రాంబాబు వదినపై ఫిర్యాదు చేయడంతో 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉషా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. ఉషాకు ఓ పోలీస్‌ అధికారితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఈ ఘోరానికి పాల్పడిందని బంధువులు ఆరోపించారు. దీంతో దీనిపై కూడా దర్యప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీఐ రాజేశ్ హామీ ఇచ్చారు.

Also read

Related posts

Share via