March 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

Sale of children : హైదరాబాద్ లో కలకలం.. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి..


కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Sale of children :  కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చైతన్యపురి ఠాణా పరిధిలో చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు గుజరాత్‌ నుంచి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసుల సాయంతో చైతన్యపురి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు చిన్నారులను రక్షించడంతో పాటు 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాచకొండ పరిధిలో మరో ముఠా

మరో సంఘటనలో పసి పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠాను మయన్మార్ దేశానికి చెందిన దంపతులు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు.మయన్మార్ నుంచి వలస వచ్చిన దంపతులు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటూ ఈ పసి పిల్లల విక్రయాల దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్ధిక పరిస్థితి భాగలేని వారి నుంచి పసిపిల్లలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే ఈ జంట. పిల్లలు లేని దంపతులను గుర్తించి వారికి అధిక ధరల్లో అమ్ముతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.ఈ ముఠాలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది

ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా పసి పిల్లలను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో మహిళలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా ఈ సందర్భంగా ఈ ముఠా విక్రయించిన పసిపిల్లలను కొనుగోలు చేసిన దంపతులను గుర్తించింది. మరోవైపు ముఠాకు అమ్మిన పసిపిల్లలను అమ్మిన తల్లిదండ్రులను కూడా పోలీసులు గుర్తించారు. కొంతమంది పిల్లల్ని ఈ ముఠా కిడ్నాప్ చేసి విక్రయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.దీనిపై కూడా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via