February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్


నిజామాబాద్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపింది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులకు మద్యం తాగించి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు

Gang rape : నిజామాబాద్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపింది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పరాయి యువతులను తమ తండాకు తీసుకు రావడంతో పాటు ఆలయ ఆవరణలో అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

గ్రామస్తులు,  ధర్పల్లి ఎస్సై జాడి రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం  ధనంబండ తండాకు చెందిన నలుగురు యువకులు నిజామాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెళ్లెళ్లను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ధనంబండ తండా నల్లగొండ నరసింహస్వామి ఆలయ సమీపానికి తీసుకొచ్చారు. పార్టీ చేసుకుందామని నమ్మించి అక్కడికి తీసుకొచ్చిన యువకులు ఆ తర్వాత వారికి మద్యం తాగించారు. వారిలో చెల్లెలుకు మద్యం తాగించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే విషయాన్ని పసిగట్టిన అక్క వారిని ప్రతిఘటించి అక్కడి నుంచి పరుగున రోడ్డుమీదకు వచ్చి కేకలు వేసింది. రోడ్డు వెంట వెళ్తున్న స్థానికులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బాధిత మహిళలు పూర్తిగా కోలుకున్న తరువాత వివరాలు తెలుస్తాయని ఎస్సై వెల్లడించారు. కాగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం

కాగా తమ తండా అటవీ ప్రాంతంలో  అందులోనూ ఆలయానికి సమీపంలో పట్టపగలు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని గ్రామస్తులు ఖండిస్తున్నారు. తమ తండాలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురి కావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలోని కొంతమంది ఆకతాయి యువకుల మూలంగా తమ తండాకు చెడు పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

Also read

Related posts

Share via