విశాఖలో పోలీసులు పరుగులు పెడుతున్నారు. పెందుర్తి శివార్లలో నరవ నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం కనిపించింది. మున్నెన్నడు లేనివిధంగా ఆ ప్రాంతంలో ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు స్థానికులు. భీమిలిలో జ్యోతిష్యుడు దారుణ హత్య కేసును చేదించే లోపే మరో అటువంటి కేసు ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది.
పెందుర్తి శివారులోని నరవ నిర్మానుష్య ప్రాంతంలో ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. అది కూడా భీమిలి కాపులుప్పాడ కేసు మాదిరిగానే సేమ్ సేమ్. సగం కాలినట్టు మృతదేహం. ఎవరో హత్య చేసి డెడ్ బాడీని తగలబెట్టేసారు. నిర్మానుష్య ప్రాంతంలోని ఓపెన్ ఏరియాలో ఓ గుంతలాంటి ప్రాంతంలో డెడ్ బాడీ పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరుగులు తీశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రప్పించారు. ఏసీపి పృద్వితేజ, పెందుర్తి సీఐ సతీష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
మృతదేహం చూస్తే సగం కాలి ఉంది.. వయసు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు పెందుర్తి సీఐ సతీష్. నిర్మానుష్య ప్రాంతం. సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి చూస్తే.. ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి మృతదేహాన్ని తగలబెట్టినట్టు ఆనవాళ్లు.
రాత్రి సమీపంలో జాతర..!
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే శుక్రవారం రాత్రి సమీపంలో.. ముత్యమాంబ జాతర మహోత్సవం జరిగింది. అందరూ రాత్రంతా సరదాగా గడిపారు. అర్ధరాత్రి వరకు ప్రోగ్రామ్స్ జరిగాయి. స్థానికులు అందరూ సందడిగా ఆ జాతరలో పాల్గొన్నారు. రాత్రి గడిచింది.. ఉదయాన్నే ఒక్కసారిగా అలజడి. జాతర జరిగిన ప్రాంతానికి కొంత దూరంలోనే నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం. దీంతో స్థానికుల్లో తీవ్ర కలవరం. అయితే ఈ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ కూడా సంచరిస్తుందని.. అంటున్నారు స్థానికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా మృతదేహం ఇలా బయటపడడంతో ఆందోళన చెందుతున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మిస్సింగ్ కేసులను వెరిఫై చేస్తున్నారు. అక్కడే హత్య చేసి తగలబెట్టారా లేక వేరే చోట హత్య చేసి తీసుకొచ్చి నిప్పంటించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నారు. అయితే మూడు రోజుల్లో రెండు ఒకేలాంటి కేసులు బయటపడడంతో.. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ పృధ్వితేజ.
మూడు రోజుల్లో రెండు ఒకేలాంటి ఘటనలు.. దారుణ హత్యలు వెలుగు చూడడంతో హడలెత్తిపోతున్నారు జనం. ఇటీవల కాలంలో విశాఖలో నేరాలు దాదాపుగా తగ్గాయి. రౌడీ షీటర్ల కదలికలు లేకుండా పోలీసులు పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారు. కానీ.. తాజాగా రెండు వేర్వేరు చోట్ల ఒకే తరహా ఘటనలు బయటపడడం ఇప్పుడు పోలీసులను కలవడానికి గురిచేస్తుంది. భీమిలిలో బయటపడిన జ్యోతిష్కుడు అప్పన్న దొర మృతదేహం కేసును చేధించి దంపతులను అరెస్ట్ చేశారు. పెందుర్తి నరవ కేసు మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఎవరు హత్య చేశారు..? ఎందుకు అంతలా హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టేసారు అనే విషయం తెలాల్సి ఉంది.
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు