March 13, 2025
SGSTV NEWS
Telangana

Taj Banjara: హైదరాబాద్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌ను సీజ్‌ చేసిన GHMC అధికారులు! కారణం ఇదే..

 

లగ్జరీ హోటల్‌ తాజ్‌ బంజారాను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. హోటల్‌ ప్రధాన గేటుకు తాళం వేసి.. జప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో ఉన్న ఈ లగ్జరీ హోటల్‌ను అధికారులు ఎందుకు సీజ్‌ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో గల లగ్జరీ హోటల్‌ తాజ్‌ బంజారాకు జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ) అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆ హోటల్‌ను సీజ్‌ చేశారు. గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటల్‌ ప్రధాన ద్వారానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్‌ బంజారా నిర్వహకులు స్పందించకపోవడంతోనే సీజ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తాజ్‌ బంజారా లగ్జరీ హోటల్‌బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 1లో ఉంది.

ఈ హోటల్‌లో నుంచి రావాల్సిన 1.43 కోట్ల ప్రాపర్టీ ట్యాన్స్పెం పెండింగ్‌లో ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యానికి అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు స్పందించలేదని, చివరిసారిగా రెండు రోజుల గడువు ఇచ్చినా కూడా హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని కూడా అధికారులు తెలిపారు. అయితే కొంత కాలంగా నగరంలోని వాణిజ్య సంస్థల నుంచి పన్ను వసూలుపై జీహెచ్‌ఎంసీ గట్టి ఫోకస్‌ పెట్టిన విషయం తెలిసిందే.



ఇక ఈ ఘటనపై తాజ్‌ హోటల్‌ యాజమాన్యం స్పందించింది. రెండేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తాజ్‌ బంజారాను సీజ్‌చేసి వారెంట్‌ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్‌ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్‌ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించింది. ఆర్టీజీఎస్‌ ద్వారా పన్ను చెల్లించినట్లు సమాచారం. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్‌ కలెక్షన్‌లో భాగంగా డిఫాల్టర్స్‌ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్‌ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్‌ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్‌ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్‌ నోటీస్‌ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.

Also read

Related posts

Share via