February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kiran Royal-laxmi: బలవంతంగా కామదాహం తీర్చుకున్నాడు.. ఆ నీచుడిని అరెస్టు చేయండి!


కిరణ్‌ రాయల్‌పై తిరుపతి ఎస్పీకి లక్ష్మి ఫిర్యాదు చేసింది. బలవంతంగా తనపై కామాదాహం తీర్చుకున్నాడని, తనకు ప్రాణ హానీ కూడా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నీచుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అతనికి నాదెండ్ల మనోహర్ అండ ఉన్నట్లు తెలిపింది.

Kiran Royal-laxmi: కిరణ్‌ రాయల్‌పై లక్ష్మి మరోసారి పోలీసులు ఫిర్యాదు చేసింది. నీచమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించింది. అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని, కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్  కాల్స్ వస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ‘నాకు న్యాయం చేయండి. కిరణ్ రాయల్‌ను వెంటనే అరెస్టు చేయండి. కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు మాత్రమే పెట్టారు. కానీ అతను నన్ను బెదిరించి, చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఘటనకు తగినట్లు సెక్షన్లు నమోదు చేయలేదు. కిరణ్ రాయల్ లాంటి దుర్మార్గుడికి శిక్ష వేయండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు..
నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. దయచేసి నా సొమ్ము నాకు తిరిగి ఇప్పిస్తే నా పిల్లలతో బతుకుతాను. కాళ్ళవేళ్ళ పడివేడుకున్నా కిరణ్‌ వినలేదు. ఏ మాత్రం కనికరం చూపలేదు. అతను నన్ను చంపేస్తానంటున్నాడు. ఏమనుకుంటున్నావు మర్డర్ చేసి జైలుకు వెళతాను. నాకు పోలీసులంటే భయంలేదు. నా గురించి ఏమనుకుంటున్నారు. మిమ్మల్ని చంపిచేస్తాను. నా వెంటుక కూడా పికలేరని భయపెడుతున్నట్లు లక్ష్మి తెలిపింది..

కిరణ్‌ అనరాని అసభ్య పదజాలంతో తిట్టాడు. నన్ను అవమానించినాడు. నాదెండ్ల మనోహర్ అండతో ఇదంతా చేశాడు.  నా భర్త చనిపోగానే నన్ను మాయమాటలతో నమ్మించి బలవంతంగా అనుభవించి నాపై కామదాహం తీర్చుకున్నాడు. ఆడియో, వీడియో ఆధారాలున్నాయి. నా  బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా అతని స్వాధీనంలోనే ఉన్నాయి. అవన్నీ నిలిపివేయవలసిందిగా బ్యాంకు వారిని కోరుతున్నానంటూ లక్ష్మి వాపోయింది.

Also read

Related posts

Share via