విశాఖ కాపులుప్పాడలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. లే అవుట్‌లో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పూసలు, ఒక ఫోటో లభ్యమయ్యాయి. ఆనందపురం పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైన..
విశాఖ కాపులుప్పాడలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. లే అవుట్‌లో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పూసలు, ఒక ఫోటో లభ్యమయ్యాయి. ఆనందపురం పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైన.. పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు మోతు అప్పన్నతో సరిపోతున్నాయి ఆనవాళ్లు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాపులుప్పాడలో లేఅవుట్ ఉంది. చుట్టూ ఆరడుగుల ప్రహరీ. అందులో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెరిఫై చేసేసరికి.. పుర్రె, సగం కాలిన శరీర భాగాలు కనిపించాయి. అక్కడే కొన్ని పూసలు ఒక ఫోటో కూడా పోలీసులకు లభ్యమైంది. క్లూస్ టీం రంగంలోకి దింపిన పోలీసులు.. అణువణువూ గాలించి ఆధారాలను సేకరించారు.
అతనిదేనా..!
అయితే మృతదేహం పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు మోతు అప్పన్నతో సరిపోలుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మోతు అప్పన్న మిస్సింగ్‌పై అనందపురం పిఎస్‌లో కేసు నమోదయింది. ఇంటింటికి వెళ్లి అప్పన్న జ్యోతిష్యం చెబుతూ ఉంటాడు. 9వ తేదీ నుంచి మిస్ అయినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుకు, మృతదేహంకు సంబంధం ఉందా అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సగం కాలినట్టు ఉన్న మృతదేహం వెనుక కారణమేంటి..? కారకులు ఎవరు గుర్తించే పనిలో ఉన్నామన్నారు ఏసిపి అప్పలరాజు.
అనుమానాలు..
అప్పన్న కుటుంబ సభ్యులను కూడా పిలిపించారు పోలీసులు. మృతదేహం అప్పన్నతో సరిపోలుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతదేహం తన తండ్రిదే అని అంటున్నాడు కొడుకు దుర్గాప్రసాద్. కొందరిపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు పోలీసులు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక.. ప్రొసీజర్ ప్రకారం మృతదేహాన్ని గుర్తిస్తారు పోలీసులు. అవసరమైతే మృతదేహాన్ని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలకు కూడా పంపుతారు. అయితే ఆ మృతదేహం జ్యోతిష్కుడు అప్పన్నదే అని ప్రాథమికంగా నిర్ధారణ కుటుంబ సభ్యులు చేసినప్పటికీ.. అతనిని హత్య ఎందుకు చేయాల్సి వస్తుందని దానిపై ఇప్పుడు మిస్టరీగా మారింది. చూడాలి మరి ఆ మృతదేహం అప్పన్నదేనా..? లేక ఇంకెవరిదా..? అంత దారుణంగా హత్య ఎవరు చేశారు..? కారణమేంటి..? పోలీసుల విచారణలో తెలల్సి ఉంది
Also Read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా