February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag Vasantha Incident: వయాగ్రా వాడుతూ, పోర్న్ చూపిస్తూ.. విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్ !


విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా  గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు.

Vizag Vasantha Incident: విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు(Nagendra Babu) ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా  గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నాగేంద్రబాబు అనేక మందుల కోసం వెతికినట్లు తేలింది. పోర్న్ వీడియోస్‌కి బానిసైన నాగేంద్రబాబు.. పెళ్లైన నెల నుంచే వసంతను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

వయాగ్రా వాడుతూ, పోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలని భార్య వసంతను వేధించేవాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంత వేడుకున్నా కనికరించేవాడు కాదని బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా సంసారానికి వసంత సహకరించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదులు చేసేవాడని తెలిపారు.  నాగేంద్రబాబును కఠినంగా శిక్షించాలని బాధిత కుటంబం డిమాండ్ చేస్తోంది.  కాగా భర్త టార్చర్‌ తట్టుకోలేక వసంత గురువారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనలో నాగేంద్రబాబు, అతని తండ్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఇంటికి తాళం వేసుకుని నాగేంద్ర అమ్మ, తమ్ముడు  పరారీలో ఉన్నారు. 

11 నెలలు కిందట పెళ్లి

విశాఖలోని గోపాలపట్నం(Vizag Gopalapatnam) నందమూరి కాలనీకి చెందిన నాగేంద్రబాబుకు 11 నెలలు కిందట వసంతతో పెళ్లి అయింది. కామపిచ్చితో నాగేంద్రబాబు.. వసంతను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.  అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్‌ చేశాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకుని పలుమార్లు వాపోయింది వసంత.భర్త మారుతాడులే అని కొన్ని రోజులు ఓపిక పట్టింది.  పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ వసంత  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  అత్త, మామ, మరిది, భర్త కలిసి వసంతను చంపేశారని అంటున్నారు

Also read

Related posts

Share via