March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Vallabhaneni Vamsi : వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు



– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… మరోవైపు వంశీ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కర్మ సిద్ధాంతం అంటూ పొలిటికల్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది.


వల్లభనేని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌కు ఇప్పటికే కోర్టు 14 రోజలపాటు రిమాండ్‌ విధించడంతో… వారిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టొచ్చన్న ఆలోచనలో ఉన్నారు పోలీసులు. అందుకే రేపు కస్టడీ పిటిషన్‌ వేయనున్నట్లు విజయవాడ సీపీ వెల్లడించారు.


ఇక వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో ఇప్పటికే 12మందిని చేర్చిన పోలీసులు… మరో 9 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరి కొంతమందిని కేసులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ కూడా కొనసాగుతోంది.

మరోవైపు కిడ్నాప్, బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్‌ రిజెక్ట్ చేయాలంటూ మెమో దాఖలు చేశారు వంశీ తరపున న్యాయవాదులు. అలాగే బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ ఇంకా పటమట పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నాడు. ఇప్పటికే అతని స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు పోలీసులు.


వంశీ అరెస్ట్‌ పొలిటికల్ కాకరేపుతోంది. వంశీ అరెస్ట్‌ అక్రమమని వైసీపీ నేతలు అంటుంటే… వారికి కౌంటర్‌ ఇచ్చారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతల మాటలు వింటుంటే కర్మ సిద్ధాంతం గుర్తొస్తోందన్నారామె. గతంలో హోమ్ మంత్రి ఆఫీస్ గేటు కూడా తమని తాకనివ్వలేదన్నారు. ఇప్పుడు ఎంతో మంది వైసీపీ నేతలు డీజీపీని కలుస్తున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే ముందు గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు హోం మంత్రి అనిత

Also read

Related posts

Share via