అధికారుల పేరుతో బెదిరింపులు, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి మాయ వలలో చిక్కుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఈ మధ్య ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అక్రమ సంపాదన కలిగిన అధికారుల ఇళ్లపై దాడులు చేయడంతో పాటు లంచాలకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా దోపిడీకి తెర లేపారు. ఏసీబీ అధికారుల పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులను సెలెక్ట్ చేసుకుని మరీ వారిని దోచేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ డిప్యూటీ తాసిల్దార్ తో సహా నలుగురు అధికారులకు ఫోన్ చేసి బెదిరించిన కేటుగాళ్లు.. వారిలో ఒకరి వద్ద 80 వేల రూపాయలు ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఇల్లు గుళ్ళై కళ్ళు తెరిచిన సదరు అధికారి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సరిగ్గా మూడు రోజుల క్రితం వరంగల్ జిల్లా సంగెం మండల పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతని ఇళ్ళు, కార్యాలయాల్లో అవినీతి శాఖ అధికారులు సోదాలు నిర్వహించి లెక్కకు మించిన ఆస్తులను గుర్తించారు. చివరికి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే రైట్ టైమ్‌గా భావించిన సైబర్ నేరగాళ్లు సంగెం మండల కేంద్రంలో కొందరు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేశారు. నేరుగా వాళ్లకు ఫోన్ చేసి దర్జాగా దోపిడీ చేసేందుకు ప్లాన్ వేశారు.
ఈ క్రమంలోనే మొదట సంగెం ఎంపీడీవో రవీందర్, ఎంపీఓ కొమురయ్యకు ఫోన్ చేసి, ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నానని నమ్మబలికాడు కేటుగాళ్లు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ కేసుల నుంచి తప్పించాలంటే రెండు లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారు. కానీ వారు లైట్ తీసుకోవడంతో తదుపరి కాల్ డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్‌కు వెళ్ళింది. డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ కు ఫోన్ చేసిన ఆ కేటుగాడు.. నీ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని…తెల్లవారితే మీపై దాడులు చేయబోతున్నామని గజగజ వణికిపోయేలా చేశాడు. రెండు లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని, లేదంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ అతని అకౌంట్‌లో ఉన్న ఎనభై వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత తను మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల పనని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 96637-55640 నెంబర్ నుండి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మనీ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేటుగాళ్లు ఎవరు..? ఇలా ఎంతమందిని బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు పోలీసులు, ఏసీబీ అధికారులు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు. అలాగే టోల్ ఫ్రీ 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ అధికారులు ఎవరూ ప్రభుత్వ అధికారులకు నేరుగా పోన్ చేసి మాట్లాడడం ఉండదని, ఎవరైనా అలాంటి వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
నమ్మి మోసపోకండి:
అధికారుల పేరుతో బెదిరింపులు, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
✅ అనుమానాస్పద ఫోన్ కాల్స్ అసలు లిఫ్ట్ చేయకండి.
✅ అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకండి.
✅ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు షేర్ చేయకండి.
✅ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే విశ్వసించండి.
✅ అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చినా స్పందించకండి.
✅ సైబర్ మోసానికి గురైతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి
Also read
- BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు!
- ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
- TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా