ఇళ్ళు, వ్యాపార స్థలాలు ప్రారంభించినప్పుడు దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం మన సంప్రదాయం. దీనిని నరదిష్టి, కనుదిష్టి నివారణకు, అడ్డంకులు తొలగించడానికి చేస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటించే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కూరలకు ఉపయోగించేది. మరొకటి దిష్టి కోసం వాడే బూడిద గుమ్మడికాయ. దీనిని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గుమ్మడికాయను కడగకూడదు. దానిపై పేరుకున్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. కేవలం పసుపు, కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది.
గుమ్మడికాయను తొడిమతో పట్టుకోవాలి. తొడిమ ఊడిపోతే దాని శక్తి పోతుంది. తొడిమ లేకుండా కడితే ఫలితం ఉండదు. మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరగేసి పట్టుకోకూడదు. అంటే కాడ కిందికి, కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు. కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుంది.
గుమ్మడికాయను కట్టడానికి సరైన సమయం
అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే కడితే మంచిది. అది దిష్టిని తొలగించి, శుభ ఫలితాలను ఇస్తుంది.
అమావాస్య కుదరకపోతే, బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందే కట్టవచ్చు.
సూర్యోదయానికి ముందు కడితే విశేష ఫలితాలు, సూర్యోదయం తర్వాత కడితే సాధారణ ఫలితాలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత కడితే ఫలితం ఉండదు.
గుమ్మడికాయను కట్టడం చాలా సులభం. గుమ్మడికాయను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు
Also read :
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి